*వలస ఆదివాసి గ్రామాలలో పగిడేరు, ఇప్పల గుంపు, ఎస్టీ కాలనీ లో తనిఖీలు
మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డిసీరియస్ వార్నింగ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మణుగూరు డివిజన్ పరిధిలో నాటు సారా కాసిన, గుడుంబా విక్రయాలు జరిపిన కఠిన చర్యలు తప్పవని మణుగూరు DSP వంగ రవీందర్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఆయన మంగళవారం
మణుగూరు సీఐ సతీష్ కుమార్, ఎక్సైజ్ అధికారులతో కలిసి వలస ఆదివాసి గ్రామాలలో పగిడేరు, ఇప్పల గుంపు, ఎస్టీ కాలనీ లో తనిఖీలు నిర్వహించారు. నాటు సారా సేవించడంతో అనేకమంది అనారోగ్యం భారిన పడి ప్రాణాలు కొల్పోవడం ,రోగాల బారిన పడే ఆస్కారం ఉందన్నారు. గుడుంబా కాస్తే జైలుకు పంపిస్తామని DSP హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు పోలీసులు ,ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 297