+91 95819 05907

మాజీ మంత్రి కేటీఆర్ పట్టువదలని కృషి…

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
18 ఏళ్ల జైలు జీవితం అనుభవించి స్వదేశానికి చేరుకున్న రాజన్న సిరిసిల్ల వాసులు
*బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పట్టువదలని కృషితో… 18 ఏండ్ల జైలు జీవితం అనంతరం దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు*

*అందరికీ విమాన టిక్కెట్లు సమకూర్చిన మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మేల్యే కేటీఆర్*

ఆగని కన్నీళ్లు… 18 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్న జైలు పక్షులు

18 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న 5 గురు జిల్లా వాసులు

రెండు నెలల క్రితం దుబాయ్ జైల్ నుండి విడుదలైన కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్

మరొకరు రెండు రోజుల క్రితం విడుదలై ఇంటికి చేరుకున్న రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హన్మంతు

దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో ఇంటి బాట పడుతున్న జిల్లా వాసులు

ఈ నెల 21 న విడుదలై స రాష్ట్రానికి చేరుకున్న పెద్దూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు.

చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశ్ వచ్చేనెలలో విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన ఒక్కరు గోళం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు, కొనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్ కి వెళ్ళారు.

వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లా వాసులు ఈ ఐదుగురు కేసులో ఇరుక్కున్నారు.

భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేశారు.

అనంతరం అప్పిలుకు వెళ్ళగా 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమా భిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు.

నేపాల్ కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్ష పై సంతకాలు చేయించారు.

వారికి ఆర్థికంగా కేటీఆర్ పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్ లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టి వేసింది. సెప్టెంబర్ లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్ళీ కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్ లో అక్కడి అధికారులతో సమీక్షించారు.

జైల్లో ఉన్న మా భర్తని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేసిన కృషి సఫలం అయ్యాయని అతనికి మేము జీవితాంతం రుణపడి ఉంటామాని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల సమావేశం

నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం లో

Read More »

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

 Don't Miss this News !