1వ తరీఖు వచ్చి 22 రోజులు ఆయే!అంగన్వాడీ ల కు జీతం పడలే:మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:ఫిబ్రవరి నెల 1వ తరీఖు వచ్చి గురువారానికి 22 రోజులు ఆయే!ఐనా అంగన్వాడీ ల కు జీతం పడలే అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎక్స్(ట్విట్టర్)వేదికగా ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తారీఖున వేతనాలు వేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికీ వేతనాలు వేయక పోవడం దారుణం అన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి కాంగ్రెస్ మోసపూరితంగా అధికారంలోకి వచ్చిందన్నారు. జీతాలు ఆలస్యం కావడంతో అంగన్వాడీల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని వెంటనే అంగన్వాడీ,ఆయాల ఖాతాలో జనవరి నెల జీతంవేయాలని డిమాండ్ చేశారు.అలాగే సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు చెల్లించాలి పోస్ట్ చేశారు.









