ఏపీ లో టిడిపి, వైసీపీ పేరుతో కండోమ్ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్, నేటి గదర్ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇది ఇలా ఉండగా ఏపీలో కండోమ్ రాజకీయం ఊపందుకుంది. టిడిపి, వైసిపి పార్టీలు కండోమ్ లు పంపిణీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. వైసీపీ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం పై అధిక భారం పడుతుందని, దానికి వ్యతిరేకంగా టిడిపి అమ్మ వందనం పథకం తెస్తుందని తద్వారా కుటుంబ నియంత్రణ చేయించి పిల్లల సంఖ్య తగ్గించాలని ఆ పార్టీ లక్ష్యం అని వైకాపా నాయకులు ఆ వీడియోలో ఆరోపిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ కండోమ్ రాజకీయాలు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చాంసనీయంగా మారింది.కాగా రాజకీయ పార్టీలు ఈ వీడియోలు రూపొందించి ఒకరి పరువు ఒకరు తీసుకుంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఇంకెన్ని చూడాలో మరి.









