సన్ ఫ్లవర్ రైతులకు మద్దతు ధర రాక తీవ్ర నష్టం:మాజీ మంత్రి హరీష్ రావు
*ప్రభుత్వం మద్దతు ధరకు సన్ఫ్లవర్ గింజలు కొనాలి
*రూ.4 వేలనుంచి రూ.5 వేలకు పంటను అమ్ముకుంటున్న సన్ఫ్లవర్ రైతులు
*ప్రభుత్వం క్వింటా రూ.6,760 మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
* రాష్ట్రవ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
* గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు
* వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: సన్ ఫ్లవర్ పంటను ప్రభుత్వం రైతుల వద్ద నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్ఫ్లవర్ పంటకు మద్దతు ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన తెలుపుతారు. మార్కెట్ యార్డులో రూ.4వేలు,5వేలకు రైతులు సన్ఫ్లవర్ పంటను అమ్ముకుంటున్నారని తద్వారా గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వెలుగుచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్ఫ్లవర్ పంటను కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం సన్ఫ్లవర్ గింజలకు క్వింటాకు రూ.6760 మద్దతు ధర ఉందని, ఈ మేరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్ఫ్లవర్ గింజలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు.
