బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఖమ్మం లో మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నలుగురు కౌన్సిలర్లు
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఖమ్మం నగరపాలకంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.గురువారంనలుగురు కార్పొరేటర్లు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్ ,ఖమ్మం నగర అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో పాలెపు విజయ(44వ .డివిజన్), ఆళ్ల నిరిష(21.డివిజన్), రాపర్తి శరత్(50. డివిజన్), మాడురి ప్రసాద్ (39. డివిజన్)ఉన్నారు. తను నమ్మి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ప్రతి నాయకుడికి అన్ని విధాల అండగా ఉంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి హామీ ఇచ్చారు.
Post Views: 106