నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(37)శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి.
పటాన్ చెరు ORR పై రోడ్ ప్రమాదం. అదుపుతప్పి ఆమె ప్రయాణిస్తున్న కారు XL6 డివైడర్ ను ఢీ ఢీకొట్టడంతో ఎమ్మెల్యే లాస్య నందిత స్పాట్ లోనే మృతి చెందింది. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాల పాలవడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా గత ఏడాది లాస్య నందిత తండ్రి సాయన్న మృతి చెందడంతో ఆమెకు బీ.ఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. యువ ఎమ్మెల్యే మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.
Post Views: 652