నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాగా వెయ్యాలని భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావుకు మరొకసారి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.కాగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అనేకమంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని,రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇద్దరు ఖమ్మం ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి రేపటినుండి పర్యటన లు ప్రారంభించనున్నారు. దీనితో ఆయన పర్యటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ప్రసాద రెడ్డికి ఇచ్చిందా? అనే అనుమానాలకు తావిస్తుంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాలేరు,మధిర,వైరా, సత్తుపల్లి,కొత్తగూడెం, అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక మధిర మినహాయిస్తే మిగతా నియోజకవర్గాలలో మంత్రి పొంగిలేటి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ కారణం చేత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు మంత్రి పొంగిలేటికి మద్దతు పలికే ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి ప్రసాద్ రెడ్డి నా అని చర్చ జరుగుతుంది.
