నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
మణుగూరు మండలం పగిడేరు గ్రామ పంచాయతి కి చెందిన , పగిడేరు మాజీ సర్పంచ్, ఎంపీటీసీ , సీపీఎం పినపాక డివిజన్ నాయకురాలు కుంజా కృష్ణ కుమారి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారం మృతురాలు నివాసానికి వెళ్లి కుంజా కృష్ణ కుమారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఆనంతరం కుంజా కృష్ణ కుమారి కుటుంబ సభ్యులను పరమర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పీటీసీ పొశం నర్సింహ రావు,బీ. ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం గౌడ్,ప్యాక్స్ చైర్మన్ నాగేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు జావేద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Post Views: 101