నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BJP కార్యదర్శిగా భుర్గంపాహాడ్ మండలం సారపాక కు చెందిన కేశ గాని శ్రీనివాస్ గౌడ్ ని నియమిస్తూ ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కే. వి.రంగ కిరణ్ కొత్తగూడెం BJP జిల్లా కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేశగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. భారతదేశం అన్ని రంగాలలో ముందుకు పోవడంతో పాటు మరి కొన్ని సంవత్సరాలలో అగ్రరాజ్యాల సరసన చేరడం ఖాయమన్నారు.BJP పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అవకాశాలు ఉంటాయి అనడానికి తానే నిదర్శనమని, తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన BJP రాష్ట్ర అధిష్టానానికి, జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాడవాడల బిజెపి పార్టీ ని తీసుకు వెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తా అన్నారు.
