నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని చేవెళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే గృహ జ్యోతి కి సంబంధించిన మార్గదర్శకాలు సైతం విద్యుత్ శాఖ అధికారులు విడుదల చేశారు. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా గృహ జ్యోతి పథకం అమలు కానుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు విడుదల చేసినట్లుగా గృహజ్యోతి జీరో బిల్లు నమూనా సోషల్ మీడియా గ్రూపులలో హల్చల్ చేస్తుంది.
Post Views: 1,382