🔸 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రచార కరపత్రాల ఆవిష్కరణ
నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి : మార్చి 1న లక్ష్మిదేవిపల్లి మండలం లాలూతండా గ్రామ పంచాయతీ, బోరింగ్ తండా హనుమాన్ గుడి ఆవరణలో కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి సదుర్గరు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక అలాచేతుల మీదుగా జయంతి వేడుకల ప్రచార కరపత్రాలను ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా కమిటి కన్వీనర్, తెలంగాణ గిరిజన నమాఖ్య, భద్రాది జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ,సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ,
జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన తెలిపారు .బంజార సమాజాన్ని సంఘటిత పర్చడానికి, స్వాభిమానంతో జీవింపచేయడానికి సేవాలాల్ ఎనలేని కృషి చేశాడని, సమాజహితమం కోసం దేశమంతా పర్యటించి బంజారా సమాజంతోపాటు పేద వర్గాలను జాగృతం చేశాడన్నారు. బంజారాలు చెడు మార్గంలో వెల్లకుండా ఉన్నతమైన జీవితం గడిపేలో కృషి చేసిన సేవాలాల్ సెవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి ఉత్సవాలను మార్చి 1న బోరింగ్‌తండా గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనింగ్ కమిటి సభ్యులు నూనావత్ గోవింద్, జర్పుల ఉపేందర్, జి.నగేష్స్ సంపత్‌కుమార్, రవి.ప్రసాద్, బాలకృష్ణ, రాములు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.