నేటి గదర్ ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాలలో తాగునీటి సదుపాయం ఏర్పాటు, వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మాస్కాపింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ అన్నారు.
Post Views: 194