సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ మెట్రిక్ హాస్టల్(PMH) ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక సమ్మె
*ప్రధాన డిమాండ్లు*
*18 నెలల వేతనాలు చెల్లించాలి
*క్యాటరింగ్ విధానం రద్దు చెయ్యాలి
*జీ ఓ నెం.60 ప్రకారం రూ.15,600 చెల్లించాలి
*ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలి
నేటి గదర్ న్యూస్,పినపాక: గత 18 నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ తో పినపాక మండలం పినపాక పి ఎమ్ హెచ్ హాస్టల్ ఎదురుగా సిఐటియు అనుబంధ సంఘం PMH ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ… గత కొన్ని నెలలుగా వేతనాలు రాకపోవడంతో తమ పరిస్థితి దీనంగా తయారైందని అన్నారు. తమచే ఊడిగం చేయించుకుంటున్న పాలకులు సకాలంలో వేతనాలు వేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వెలువచ్చారు. తమ న్యాయ సమ్మతమైన డిమాండ్ పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా 18 నెలల వేతనాలు చెల్లించాలని,క్యాటరింగ్ విధానం రద్దు చెయ్యాలి,జీ ఓ నెం.60 ప్రకారం రూ.15,600 చెల్లించాలి,ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘం PMH ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు చందా జలందర్, గనిబోయిన లక్ష్మీ, కుర్సం మానస, గొంది ఉదయ లక్ష్మీ, అలెం స్వరూప,పాయం సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
