* బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి
అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాటల యుద్ధం చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష పదజాలంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు.రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండి.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా ఎందుకు గెలిపించలేదు.
రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 ఎంపీలను గెలిపించి నీ మగతనం చూపించు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
