*నేను నా తల్లితో రోజు నాలుగు సార్లు మాట్లాడుతా
* నేను ప్యూర్ వెజిటేరియన్
* కాంగ్రెస్ పార్టీలో నా దయాదాక్షిన్యాలతో నీవు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యావు
* నీ సంగతి చూస్తా
మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
*బండి సంజయ్‌కి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:కరీంనగర్ ఎంపీ,BJP జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఫైర్ అయ్యారు. రాముని విషయంలో ఇదివరకే పొన్నం కామెంట్ చేయగా ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా తల్లిపై బండి సంజయ్ ఇష్టానికి మాట్లాడడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహానికి కారణమైంది. ఎంపీ బండి సంజయ్
నా దయా దక్షిణ్యాలతో కాంగ్రెస్ పార్టీ నుండి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యావు అని గతం గుర్తు చేశారు.అలాగే
నేను వెజిటేరియన్.. బండి సంజయ్ రోజు నాన్ వెజ్ తింటాడు, మందు తాగుతాడు అని అన్నారు.
నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావ్.. నీకంటే ముందే నేను ఎంపీ అయ్యాను – మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తన తల్లికి ప్రతిరోజు నాలుగు సార్లు ఫోన్ చేస్తే యోగక్షేమాలు తెలుసుకుంటానని… ఎంపీ బండి సంజయ్ తల్లి పై మాట్లాడటం సరికాదన్నారు.
