జడల చింతలో వైద్య శిబిరం ఏర్పాటు
జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి : జూలూరు పాడు మండల పరిధిలోని జడల చింత గ్రామంలో జ్వరాలతో బాద పడుతున్న ప్రజలకు మెడికల్ క్యాంపు నిర్వహించి తక్షణమే వైద్య సౌకర్యం అందించాలని కోరుతూ మంగళవారం సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కమిటీ అందజేసిన వినతికి స్పందించి మండల వైద్య ఆరోగ్య శాఖ బుధవారం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో కీళ్ల నొప్పులు, జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాపంథా నాయకులు మాట్లాడుతూ తక్షణమే స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పలు గ్రామాలలో వాతావరణం మార్పుల కారణంగా జ్వరాలు, దగ్గు, జలుబు, తోపాటు, చిన్నపిల్లలు గొంతు వాపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కావున అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ నాయకులు ఏదులాపురం గోపాలరావు, మండల కార్యదర్శి భానోత్ ధర్మ, వైద్యులు బి వెంకటేశ్వర్లు, సిబ్బంది కృష్ణ, రాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
