నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి బట్టీల గుంపు సమీపంలో ఉన్న రాంనగర్ యుపిఎస్ పాఠశాల విద్యార్థులు త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నాయి. ఆ పాఠశాలలో ఉన్న చేతి పంపు కొట్టిన వెంటనే నీరు రాకపోవడంతో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత త్రాగునీటికి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఆ పాఠశాలకు త్రాగునీరు వస్తున్నప్పటికీ ఆ నల్ల చుట్టూ బురద చేరి అద్వాన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. తద్వారా పాఠశాల విద్యార్థులు రోగాల బారిన పడే ఆస్కారం ఉంది. జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి పాఠశాల విద్యార్థులకు తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Post Views: 66