నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కొనిజర్ల మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావుపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కత్తితో దాడి చేశారు.
తన నివాసంలో ఇంటి బయట నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు దాడి చేసి పరారయ్యారు.
రామారావుపై పాత కక్షలు నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. కత్తిపోట్లకు గురైన రామారావును ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Post Views: 76