*సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA డా.తెల్లం వెంకట్రావు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాచలం పట్టణ అభివృద్ధికి సాయ శక్తుల కృషి చేస్తా అని భద్రాచలం MLA డా. తెల్లం వెంకట్రావు అన్నారు.ఆయన భద్రాచలం పట్టణంలో ని కూనవరం రోడ్, మైథిలి కాలేజీ నందు నూతన సీసీ రోడ్డు కు శంకుస్థాపన చేశారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశంతో భద్రాచలం నియోజకవర్గంని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్,నర్రా రాము,MD నవాబ్ ,దుద్దుకురి సాయిబాబు, యూత్ ఉపాధ్యక్షులు పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Post Views: 85