నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: దుమ్ముగూడెం మండలం మారాయి గూడెం గ్రామంలో వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను మహబూబాబాద్ ఎంపీ కవితా మాలుత్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావులు గురువారం దర్శించుకున్నారు. దుమ్ముగూడెం మండల బీ,ఆర్ఎస్ నాయకులు, జాతర కమిటీ వారికి ఘన స్వాగతం పలికారు. వారిరువురు ఆ తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ తల్లులను వేడుకున్నట్లు వారు తెలిపారు.
Post Views: 116