రైతుబంధు పైసలు పంచుకున్న మంత్రులు
లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటాదో? పోతాదో?
*బిజెపి ఎంపీ అరవింద్ ధర్మపురి
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సంబంధించి రైతుబంధు నిధులు 7వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచి వెళితే వాటిని ప్రస్తుత ప్రభుత్వం మంత్రులు పంచుకున్నారని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం BJP పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల తర్వాత ఉంటాదో? పోతాదో? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే రైతుబంధు నిధులకు సంబంధించిన రూ. 7వేల కోట్లలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2వేల కోట్లు, కోమటిరెడ్డి రూ . 3వేల కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఎంపీ ధర్మపురి మాటలకు మంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Post Views: 74