*ప్రతినెల జరిగే సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పూర్తిస్థాయిలో హాజరు కావాలి
*లేబర్ కార్డు పొందిన సభ్యులకు మాత్రమే ప్రభుత్వ పరిహారం
*ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాచలం యూనియన్ సభ్యుల సమావేశం
*యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ చుక్క సుధాకర్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:జిల్లాలో ఎలక్ట్రీషియన్ యూనియన్ లో కొనసాగే ప్రతి సభ్యుడు ప్రతి సభ్యుడు లేబర్ కార్డు కలిగి ఉండాలి అని తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చుక్క సుధాకర్ అన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాచలం యూనియన్ సభ్యుల సమావేశం శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సభ్యులకు సంబంధించి పలు అంశాలు చర్చించారు. ప్రతి సభ్యుడు విధిగా ప్రతినెల 1న జరుగు సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పూర్తిస్థాయిలో హాజరవ్వాలని …అటువంటి సభ్యులకు మాత్రమే యూనియన్ లో సభ్యత్వం కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి సభ్యుడు తన యొక్క లేబర్ కార్డును కచ్చితంగా పొంది ఉండాలని ,లేబర్ కార్డు పొందిన సభ్యుడు మాత్రమే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి అర్హుడని తెలియజేశారు. యూనియన్ ను మరింత పటిష్టం చేసి ముందుకు నడపడానికి యూనియన్ నాయకులను ,కార్యవర్గ సభ్యులను ఎన్నుకోడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. సభ్యులలో యూనియన్ కి సేవ చేయగలిగిన సభ్యులు వారంలోపు పేర్లు జిల్లా అధ్యక్షులు కమిటీ కి ఇవ్వవలసినదిగా సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు. బాధ్యతారహితంగా నడుచుకునే సభ్యులను యూనియన్ నుండి తొలగించబడునని, ప్రతి సభ్యుడు కూడా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు కచ్చితంగా సర్వసభ్య సమావేశానికి హాజరవ్వాలని లేనిచో
ఆ సభ్యుని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆ సంఘం సెక్రటరీ SK.రహీం, ట్రెజరర్
M.పుల్లారావు, గౌరవాధ్యక్షులు చీపుర్ల శ్రీనివాస్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
