*మరోసారి అక్కసు వెళ్లగక్కిన సీఎం రేవంత్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ మేడిపండు చందంగా తయారైందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుపై మరోసారి అక్కకు వెల్లగక్కారు.శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ స్వర్గీయ దూదిల్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జయశంకర్ జిల్లా మాదాపూర్ మండలం మేడిగడ్డ వద్ద నిర్మించిన ఈ బరాజ్ మంత్రి శ్రీధర్ బాబు సూచన మేరకే ఏఐసిసి మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ,తను కలిసి వేడిగడ్డ ప్రాజెక్టు పరిశీల చేయడం జరిగిందన్నారు. తద్వారనే మేడిగడ్డ అవినీతి బయట ప్రపంచానికి తెలిసినట్లు అయిందన్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య కాలేశ్వరం ప్రాజెక్టుపై మాటల యుద్ధం జరుగుతున్న విషయం విధమే. మరోమారు మేడిగడ్డ బరాజ్ ను ముఖ్యమంత్రి మేడిపండుతో పోల్చడంపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వెయిట్ చేయాల్సిందే.