* స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దూదిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ హైదరాబాద్ నడి ఒడ్డు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై తెలంగాణ రాష్ట్రానికి చెంది దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సాధించిన ప్రముఖుల విగ్రహాలను భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.శనివారం మంత్రి, మంథని ఎమ్మెల్యే దూదిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంత్రి తండ్రి దివంగత శ్రీపాద రావు జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన దూదిళ్ళ శ్రీపాద రావు 87వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. తొలిత ఆయన శ్రీపాదరావు విగ్రహానికి పూలమానులు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించిందని గుర్తు చేశారు.శ్రీపాదరావు రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవలు మరువలేనిమన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఆదివాసీ ల పోరాట యోధుడు కొమరం భీం, బిర్సా ముండా, సర్ధార్ పాపన్న గౌడ్,మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి స్పీకర్లు మంత్రులు, శ్రీపాదరావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
