నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలు కు దూకుడు పెంచింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు,రూ.10 లక్షలకు ఆరోగ్య శ్రీ పరిధి పెంపు,రూ.500 కే గ్యాస్ సిలిండర్,గృహ వినియోగానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఈ నెల 11న ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో నేటి గదర్ న్యూస్ 200 ఉచిత విద్యుత్ కి సంబంధించి వివరాలు సేకరించింది. తెలంగాణ ప్రభుత్వం గత నెలల్లో గృహ వినియోగానికి సంబంధించి గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ సంబంధించి జీవో నెంబర్ 17 విడుదల చేసినట్లు సమాచారం.
*దీనిలో పలు అంశాలు పేర్కొన్నారు.*
1. గృహ జ్యోతి పథకం గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్తుకు మాత్రమే వర్తిస్తుంది.
2. ప్రతి గృహానికి 200 లేదా ఆ లోపు వినియోగించిన విద్యుత్ యూనిట్లకు మాత్రమే ఈ పథకం వర్తింపు.
3. ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు
4. 200 లేదా ఆలోపు గృహ అవసరాలకు విద్యుత్తు వినియోగించిన వారికి మాత్రమే జీరో బిల్లు
5. అర్హులు ప్రజాపాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసి ఉండాలి
6. డిస్కమ్స్ కన్జ్యూమర్స్ పేర్లు మార్చకూడదు. ఎవరి పేరా మీటర్ ఉంటే వారి పేరు మీద జీరో బి ల్లు ఇవ్వడం జరుగుతుంది
7. గృహ వినియోగానికి కాకుండా వేరే ఇతర అవసరాలకు ఈ పథకం లబ్ధిదారు లు విద్యుత్తును వినియోగిస్తే IPE ఎలక్ట్రిసిటీ ACT 2003 ప్రకారం చర్యలు ఉంటాయని ఆ జీవోలో పేర్కొనడం జరిగింది.
8. మార్చి నెల నుండి గృహ జ్యోతి పథకం అమలులోకి వచ్చింది.
9. ప్రతి నెల 20వ తారీకు లోపు గృహ జ్యోతి సంబంధించి డిస్కమ్ లు ప్రభుత్వానికి వివరాలు వెల్లడించాలి.