+91 95819 05907

KTDM:మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని జరువుకుందాం:సీపీఐ మావోయిస్టు

మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని జరువుకుందాం:సీపీఐ మావోయిస్టు బీ కే ఏ ఎస్ ఆర్ కమిటీ
*ఆజాద్ పేరా లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ(BKASR) మావోయిస్టు ఆజాద్ పేరా సోమవారం లేఖ విడుదల చేశారు.1911లో మహిళ సోషలిస్టుల రెండవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో కా క్లారా బట్కిన్ ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రజాస్వామ్యం సోషలాజీల కొరకు జరుగుతున్న పోరాటాలలో ప్రపంచ శ్రామిక మహిళలను ఐక్యం చేయడం కొరకు చేసిన ప్రతిపాదనే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అన్నారు. మహిళలు పితృస్వామ్యం నుండి పితృస్వామ్యాన్ని కాపాడుతున్న దోపిడి సమాజాల నుండి విముక్తి కోసం కార్మిక వర్ణ విప్లవంలో సంఘటితపడవలసిన అవసరాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నొక్కి చెబుతుందన్నారు. అర్ధచలని అర్థ భూస్వామ్య సమాజంగా ఉన్న దేశంలో స్త్రీలు సామ్రాజ్యవాదుల దళారి బూర్జువ భూస్వామ్య వర్గాల దోపిడి పీడనలకు గురికావడమే కాకుండా అనేక రకాలుగా తీవ్రంగా అణచివేయబడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలి పేద రైతు మహిళల శ్రమశక్తిని దోపిడికి గురి చేస్తున్నారని, పట్టణాలలోని పరిశ్రమలలో అసంఘటిత రంగంలో మహిళ కార్మికుల్ని పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు చాలా తక్కువ వేతనాలు ఇచ్చి ఆర్థిక దోపిడికి, లైంగిక అత్యాచారాలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతి వ్యాపార ప్రకటనలలో స్త్రీలను అశ్లీలంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చి వేస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళలను ఆదర్శంగా తీసుకొని వర్గ పోరాటంలో దేశంలో మహిళ విముక్తికై పోరాడుతూ అనేక త్యాగాలు చేస్తున్నారు. ఈ దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా సాహసోపేతంగా పోరాడుతున్నారు. పితృ స్వామిక అణచివేతలకు కుటుంబ హింసకు లైంగిక దోపిడి వ్యతిరేకంగా హిందుత్వ కార్పొరేట్ శక్తుల దోపిడికి వ్యతిరేకంగా దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. పోలీసులు సైనిక బలగాలు చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేస్తున్నారు. మహిళలు కేవలం తమ విముక్తి కోసమే కాక శ్రామిక వర్గ విముక్తి లో భాగంగా నూతన సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమంలో భాగమయ్యారు. భూస్వామ్య పీడనలకు సామ్రాజ్యవాద దోపిడి సంస్కృతులకు స్త్రీ విముక్తికి ఎందరో వీర వనితలు తమ ప్రాణాలను త్యాగం చేసి పోరాడుతున్నారు. శ్రామిక మహిళ విముక్తి కోసం పోరాడుదాం.

2) మహిళలపై జరుగుతున్న అన్ని రకాల రాజ్య హింసలకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం.

* స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించుకుందాం.

6 బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాద సంకెళ్లను తెంచుకుందాం.

4) స్త్రీ విముక్తికై పోరు బాటలో నడుద్దాం.

5) శ్రామిక విముక్తి లేనిదే స్త్రీ విముక్తి లేదు అని మావోయిస్టు పార్టీ ఆ లేఖ లో పేర్కొంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !