వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి, మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నా శక్తి మేర మున్నూరు కాపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ను సోమవారం ఉదయం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మున్నూరు కాపు న్యాయమైన హక్కుల సాధన కోసం వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 5000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి, వైరా నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్లు రావడానికి మున్నూరు కాపులు ప్రధాన భూమిక పోషించారని వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతు వారికి రుణపడి ఉంటానని అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోను జిల్లా మంత్రుల తోనూ చర్చించి కార్పొరేషన్ ఏర్పాటుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అదే విధంగా మున్నూరు కాపు సమస్యలన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తన గెలుపుకు సహకరించిన వైరా నియోజకవర్గ మున్నూరు కాపులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, మండల ఉపాధ్యక్షులు గోపు రామకృష్ణ, తాటికొండ వెంకటరాం ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల నాగేశ్వరరావు, మండల కోశాధికారి రామిశెట్టి నాగేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి ఉసికల వెంకటేశ్వర్లు, మండల నాయకులు పగడాల అఖిల్, పాలెపు భద్రయ్య, వడ్డే నరసింహారావు, తోట శ్రీను, పపిన్ని వెంకయ్య, పాపిని జనార్ధన్, చౌడం నాగరాజు తదితరులు ఉన్నారు.