నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:రైతుల పంట భీమాకు రైతు వాటా ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తాం అనే నిర్ణయం హర్షణీయం
అని DCMS డైరెక్టర్ పరుచూరి రవికుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అమలు కానున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లో రైతులవాటా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించిన రాష్ట ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు లకు DCMS డైరెక్టర్ పరుచూరి రవికుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం వానాకాలం నుంచి అమలు చేసి అర్హులైన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది అని తెలిపారు. గత BRS ప్రభుత్వంలో పరిహారం చెల్లింపులు ఆలస్యంగా జరిగేవని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ తో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయమని, ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదని ఆయన అన్నారు. తమది రైతు ప్రభుత్వం… రైతుకు ఏ కష్టం వచ్చిన ఆదుకుంటామన్నారు.
