*నేతకాని కులానికి రాష్ట్ర రాజధానిలో కుల భవనం ఏర్పాటు చేయాలి
*ఏజెన్సీ నేతకాని సంఘం అధికార ప్రతినిధి జాడి శ్రీనివాసరావు.
నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రికొత్తగూడెం జిల్లా:
నేతకాని కులస్థుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి, బడ్జెట్ కేటాయించాలని ఏజెన్సీ నేతకాని సంఘం అధికార ప్రతినిధి జాడి శ్రీనివాసరావు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలనీ డిమాండ్ చేశారు. బుధవారం కరకగుడెం మండల కేంద్రం లో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…. వందలాది సంవత్సరాలుగా, తర తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి, పెరిగి , కులీ నాలీ చేసుకుని బ్రతుకుతున్నామని అన్నారు. మా బ్రతుకులు మారాలంటే పుట్టిన ప్రాంతం లో భూమి పై భుక్తి పై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు హక్కులు కల్పించాలని , నేతకాని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నేతకాని కులస్తులకు ఆర్థికంగా సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని వేదికగా హైదరాబాద్ లో మా కుల భవనానికి 10 ఎకరాల స్థలం కేటాయించి, నిధులు సమకూర్చి, కుల భవనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మా కుల పేరు నేతకాని అయితే గెజిట్ లో నెట్ కానీ గా రావడం బాధ కరమని ఆవేదన వ్యక్తం చేశారు. గెజిట్ లో వచ్చే అట్టి అచ్చు తప్పుని సరి చేసి నేతకాని గా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి పేదవాడికి బ్రతుకు దెరువు చూపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను కోరారు. మా సమస్యలను పరిష్కరించకుంటే మా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని అధ్వర్యంలో దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ సమావేశంలో బాడిశ.లక్ష్మయ్య. గోగు.వీరస్వామి. గోగు.శ్రీను, గోగు.క్రిష్ణ, జనగం.చందు. జాడి.రామనాథం, గోగు. కిరణ్, రాంటెంకి. సమ్మయ్య, డా.సల్లూరి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు