నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాచలం MLA డాక్టర్ తెల్లo వెంకటరావు దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసిన సంఘటనను BRS నాయకులు బుధవారం తీవ్రంగా ఖండించారు.BCMలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం BRS మండల కమిటీ సమావేశంలో మండల అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు ,ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి లు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లo వెంకటరావు దిష్టిబొమ్మ తగలబెట్టడం సిగ్గుమాలిన చర్య ఆని అన్నారు.
భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లo వెంకటరావు కట్టుబడి ఉన్నారు. ఇది నచ్చని కాంగ్రెస్, టిడిపి నాయకులు మా ఎమ్మెల్యే మీద అవాకులు చావాకులు పేలడం తగదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అర్థరహితంగా ఉన్నాయి. భద్రాచలం అభివృద్ధి నిధుల కొరకు ముఖ్యమంత్రిని కలిస్తే , కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటి…?
పొదెం వీరయ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి, భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేనందువలన ప్రజలు తిరస్కరించి డాక్టర్ తెల్ల వెంకటరావు గని గెలిపించుకోవడం జరిగింది. భద్రాచలం అభివృద్ధి కొరకు డాక్టర్ తెల్లo వెంకట్రావు ముఖ్యమంత్రి ని, స్థానిక మంత్రులను కలిసి భద్రాచలానికి నిధులు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే తప్ప, వాళ్ళు ఊహించిన రీతిగా ఏమీ లేదని అన్నారు.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది కాంగ్రెస్ ,టిడిపి నాయకుల చర్యలు తప్ప, ఏమీ లేదు… వెంకట్రావు దిష్టిబొమ్మ తగలబెట్టడం అనేది వాళ్ళు ఇంగిత జ్ఞానానికి వదిలిపెడుతున్నాం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతంగా కాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాం అని BRS శ్రేణులు ఘాటుగా స్పందించారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, జాయింట్ సెక్రెటర బొంబోతుల రాజీవ్, పార్టీ మండల నాయకులు అంకుజు సునీల్, పెద్దినేని శ్రీనివాస్ , కోలా రాజు యూత్ మండల అధ్యక్షులు గాడి విజయ్ సెక్రటరీ ఆకుల వెంకట్ జాయింట్ సెక్రెటరీ పులగిరి నాగేందర్ చర్ల అధికార ప్రతినిధి కోటేరు శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగినది
