నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాచలం అభివృద్ధి కి నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉందని మంత్రులు తెలిపారు.
భద్రాద్రి ఆలయ అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
భద్రాచలం ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలతో రండి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు, సీఎం పర్యటన నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాలయం చుట్టూ రెండు ప్రాకారాలు, రోడ్డు నిర్మాణానికి అధికారుల వద్ద ఉన్న ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను సమీక్షించారు. ఈనెల 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన, రాముల వారి దర్శనం నేపథ్యంలో ఏర్పాట్ల గురించి మంత్రులు సమీక్ష చేశారు. ఇంజనీరింగ్, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రులు సూచించారు.
