*కేవలం 20 % స్థానిక (స్థానిక యువత)మ్యాన్ పవర్ కి మాత్రమే ఉపాధి
*మణుగూరు సింగరేణి GM 70% ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అనే మాటలు ఉత్తి మాటలేనా?
* ఆ కంపెనీ తీరుపై స్థానికుల ఆగ్రహం
* మణుగూరు సమాచార కార్యకర్త కర్నె బాబురావు సమాచార హక్కు చట్టం దరఖాస్తు తో నిజాలు బట్టబయలు
* స్థానిక యువకుల ఉపాధి కోసం పోరాడుతా: సామాజిక కార్యకర్త, WGL-KMM- NGLపట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సాక్షాత్తు సింగరేణి జిఎం స్థానిక యువతకు మణుగూరు ఓబి కంపెనీలలో 70 శాతం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఉత్తుత్తి మాటలే అని.. సమాచార హక్కు చట్టం దరఖాస్తు తో ఓ ఓబి కంపెనీ నిర్వాహకం తేటతెల్లమయింది. సమాచార హక్కు ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం oc లలో ఓబి తీయడానికి పలు ప్రైవేట్ కంపెనీలు సింగరేణి తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మణుగూరు ఏరియాలో దుర్గా కంపెనీ,VR కంపెనీ,KLP MHALAXMI -JV కంపెనీలు OB కార్మికులను నియమించుకొని పనులు చేపడుతున్నారు. నిబంధనల మేరకు స్థానిక యువతకు 70 % ఉపాధి కల్పిస్తామని పలు వేదికలపై మణుగూరు సింగరేణి జిఎం ప్రకటించినట్లు సమాచారం. కానీ ఆయా ఓబీ కంపెనీలు తమ ఇష్టానుసారంగా స్థానికులకు అన్యాయం చేస్తూ స్థానికేతరులను అధిక సంఖ్యలో నియమించుకున్నట్లు సమాచార హక్కు చట్టం 2005 ద్వారా బట్టబయలు అయింది.KLP MHALAXMI -JV లో 851 కార్మికులు ఉండగా వారిలో 282 మంది స్థానిక యువకులకు మాత్రమే ఉపాధి కల్పించారు. దీనితో ఆ కంపెనీ వ్యవహరిస్తున్న తీర్పట్ల మణుగూరు పరిసర ప్రాంతాల స్థానిక యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్య దృష్టి సారించి తక్షణమే ఆయా ఓబి కంపెనీలలో 70% అవకాశం స్థానిక యువతకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి జిఎం ఎలా స్పందిస్తారు వెయిట్ చేయాల్సిందే మరి.
ఓబి కంపెనీలలో స్థానిక యువకుల ఉపాధి కోసం పోరాడుతా: Karne Ravi మణుగూరు సింగరేణి ఓబి కంపెనీలలో ఓబి కాంటాక్ట్ దక్కించుకున్న గుత్తేదారులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దారుణం అని సామాజిక కార్యకర్త, WGL-KMM- NGLపట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి మండిపడ్డారు. సింగరేణి జిఎం స్థానిక యువతకు ఓబీ కంపెనీలలో 70 శాతం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. స్థానిక యువతకు ఓబి వెలికి తీసే కంపెనీలలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి తరఫున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.