నేటి గదర్ న్యూస్ ప్రతినిధి,జూలూరుపాడు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 30మంది విద్యార్థులకు JPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ జామెంట్రీ కిట్ పంపిణి చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జెపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇడుపుల రాజు పాల్గొని పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు All the best చెప్పారు.విద్యార్థులకు పరీక్ష సమయంలో నూతన ఉత్సాహం తో ఉండాలని, విద్యార్థి దశ నుండి, ప్రతి ఒక్కరు సేవాభావం కలిగి ఉండాలని సూచించారు.విద్యార్థులందరూ చక్కగా చదువుకొని పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని “విద్యార్థి భవిష్యత్తుకు పునాది 10వ తరగతి” అని జీవితంలో ముందడుగు పడేది ఈ పరీక్షల అనంతరం అని ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు టి లక్ష్మీ నర్సయ్య, సీనియర్ ఉపాధ్యాయులు ఆర్. శ్రీనివాస్, ఎస్ శాంతకుమారి, పి రామనాథం, గురుమూర్తి, ట్రస్టు సభ్యులు సంతాపురపు ప్రవీణ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు.
