+91 95819 05907

TS:పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదు

మాజీ మంత్రి టీ. హరీష్ రావు కామెంట్స్👇

🔹సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

🔹మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన

🔹రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలె

🔹చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయి

🔹పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే.. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదు

🔹మేము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.. అలాంటి కేసీఆర్‌ను తిట్టడం అవివేకం.. తీవ్రంగా ఖండిస్తున్నాం

🔹పేగులు మెడలో వేసుకొని రాక్షసులు తిరుగుతరు.. ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా

🔹పడిగట్టు పదాలు, పరుష పదజాలంతో పరిపాలన సాగదు

🔹ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు

🔹మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దు

🔹నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతరు.. నేను అలా మాట్లాడి విలువ తగ్గించుకోను

🔹కుసంస్కారంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుంది

🔹భవిష్యత్‌లో రాజకీయాలకు వచ్చే వారికి స్ఫూర్తిగా మనం ఉండాలనే విలువలతో నేనుంటాను

🔹ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు, ప్రజల కోసం ఎంత గట్టిక పని చేసినం అన్నది ముఖ్యం

🔹కేసీఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నడు

🔹మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నడు

🔹 బీఆర్ఎస్ పాలనలో ఎన్ని బతుకులు బాగుపడ్డాయి.. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఎన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి చూస్తే కేసీఆర్ ఏం చేశారో రేవంత్ రెడ్డికి అర్థం అవుతుంది

🔹పదేళ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు.. పాలమూరు వలసలు వాపస్ చేసింది కేసీఆర్

🔹వలసలకు నిలయం నాటి పాలకులు చేస్తే, వ్యవసాయానికి నిలయం చేసింది కేసీఆర్

🔹తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినా అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు

🔹ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా.. పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసింది కాంగ్రెస్ కాదా

🔹పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీ

🔹కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు

🔹పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి వైఎస్ నీళ్లు తీసుకువెళ్తే రేవంత్ రెడ్డి మాట్లాడాడా?

🔹కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు

🔹1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ మేము పదేండ్లలోనే రూ. 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7 వేల ఎకరాలకు నీళ్లు అందించాం

🔹నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము రూ. 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం

🔹బీమా కింద 12 వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే రూ. 646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం

🔹కోయిల్ సాగర్ పనులు పూర్తి చేసి 32 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చాం

🔹ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం

🔹వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ

🔹బొంబాయి బస్సులు బంద్ అయ్యేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ

🔹వాస్తవాలు కప్పి పెట్టి కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నడు రేవంత్ రెడ్డి

🔹పాలమూరు ప్రాజెక్టు 80శాతం అయ్యింది. కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇవ్వండి

🔹తాగు, సాగు, విద్య, పరిపాలనలో పాలమూరును అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆర్

🔹5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. 60 ఏండ్ల మీ పాలనలో ఒక్క కాలేజీ ఏర్పాటు చేయలేదు

🔹చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయండి

🔹మేము పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేశాం

🔹నికర జలాలు తెలంగాణ అప్పుడు వస్తాయి.. మంచి వాదనలు వినిపించండి

🔹పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదు

🔹ఓట్లు సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !