నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
★నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు న్యాయం చేయాలి.
★ రైతు లు విక్రయించిన బాలాజీ పర్టిలైజర్స్ షాపు పై క్రిమినల్ కేసులు నామోదు చేయాలి.
★రైతు నేస్థం అని ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహించే ప్రభుత్వానికి గిరిజన రైతుల గోడు కనబడుటలేదా.
★సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ
నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు నష్టం పరిహారం అందించి,విత్తనాలు అందించిన విత్తనాల దుకాణం పై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ గురువారం డిమాండ్ చేసారు.నకిలీ విత్తనాలతో మోసపోయిన తాళ్ళపాయి గిరిజన రైతులకు మద్దతుగా జన్నాథపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అఖిలభారత ప్రగతి శీల రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాళ్ళపాయ గ్రామములో నకిలీ విత్తనాలతో మోసపోయింది గిరిజన రైతులు కాబట్టే న్యాయం చేయడంలో అధికారులు,ప్రభుత్వం,విత్తన కంపెనీలు ఉదాసీనత వహిస్తున్నాయని,ఇదే బాలాజీ ఫెర్టిలైజర్ విత్తనాల దుకాణం లో మాదారం గ్రామానికి చెందిన గిరిజనేతర రైతు కు కాలం చెల్లిన పురుగు మందులు విక్రయించి పది ఎకరాలలో పంట నష్టపోయిన దాకలాలు అనేకం వున్నాయన్నారు.లాభార్జనే ధ్యేయంగా నకిలీ లతో అమాయక గిరిజన రైతులను నకిలీలతో మోసం చేస్తున్న బాలాజీ పర్టిలైజర్స్ విత్తనాల దుకాణం పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,గిరిజన రైతుకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.గిరిజన రైతులకు న్యాయం చేయాని పక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోతుగంటి లక్ష్మణ్,యర్రగొర్ల రామారావు,నకిరకంటి నాగేశ్వరరావు,పొడియం రాజు,మడివి మహేష్ మరియు మడకం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.