నేటి గధర్ న్యూస్,జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు నిర్మించాలి అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ బస్ షెల్టర్ లను ఎప్పుడు నిర్మిస్తా బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ మాలోత్ రామదాసు నాయక్ కి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
24 గ్రామపంచాయతీల అనుసంధానం చేయబడిన JULURUPAD మండలంలో మారుమూల గ్రామాల నుండి విద్యను అభ్యసించేతందుకు విద్యార్థిని విద్యార్థులు దూరం వెళ్లి చదవాల్సి వస్తుంది. ప్రభుత్వ కళాశాలలనిర్మించి విద్యార్థినీ విద్యార్థులకు మేలు చేయాలని కోరడం జరిగినది .అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్ కి వారి వారి పనుల కోసం అనునిత్యం ప్రజలు వస్తూ ఉంటారు వారిలో మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు పబ్లిక్ టాయిలెట్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తక్షణమే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని, అదేవిధంగా దూర ప్రయాణాలు చేసేవారు ఎర్రటి ఎండలో నిల్సోవలసి వస్తుంది బస్ షెల్టర్ ను కూడా నిర్మించాలని MLA ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సంతవరపు ప్రవీణ్. మోదుగు మనోజ్. తదితరులు పాల్గొన్నారు.
