★క్రమంగా రుణాలు చెల్లించిన ఆరుగురు మహిళలకు సన్మానం
◆SBI స్వయం సిద్ధ పథకం రుణా పత్రాలను గ్రూప్ సభ్యులు అందజేసిన SBI మేనేజర్ రాజేంద్ర నాయక్
◆SBI ములకలపల్లి శాఖలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నేటి గదర్ న్యూస్,అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి(ములకపల్లి):ఎందరో వనితల కష్టానికే గుర్తింపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని SBI ములకలపల్లి శాఖ మేనేజర్ రాజేంద్ర నాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం
ఎస్బిఐ ములకలపల్లి శాఖ నందు డ్వాక్రా మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. మహిళల ఆర్థిక స్వాలంబనకు SBI అందిస్తున్న స్వయం సిద్ధ పథకం రుణాలను ములకలపల్లి మేనేజర్ రాజేంద్ర నాయక్ ప్రారంభించి స్వయంసహాయక సభ్యులకు రుణాల మంజూరు పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా ఎస్బిఐ మేనేజర్ రాజేంద్రనాయక్ మాట్లాడుతూ SBI మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల ఆర్థిక స్వాలంబనకు స్వయం సిద్ధ పథకం రుణాలను అందజేయడం జరుగుతుందని, ఈ రుణాలు ఏదైనా స్వయం సహాయక సంఘంలో రెండు సంవత్సరాలు అనుభవం ఉండి క్రమంగా రుణాలు చెల్లించే సంఘం సభ్యులు అర్హులని తెలిపారు. పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు తోనే 30 రకాల యూనిట్ల ఏర్పాటుకు లక్ష రూపాయల నుంచి 5 లక్షల రుణం అందజేయడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘం సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలాంన్నారు. ఈ సందర్భంగా క్రమంగా రుణాలు చెల్లించే స్వయంసహాయక సంఘాల కు చెందిన ఆరుగురు మహిళలను సన్మానించారు. వారిలో ఇద్దరు మహిళలకు స్వయం వృద్ధి రుణాల మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘం మహిళలు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
