నేటి గధర్ న్యూస్ ప్రతినిధి,జూలూరుపాడు: జూలూరుపాడు మండలం భేతాలపాడు రైతు వేదిక సమీపంలో గురువారం అర్ధరాత్రి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా మట్టి, ఇసుకను తరలిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న CI ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు అర్ధరాత్రి ఇసుక,మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల పై దాడులు నిర్వహించి 2 ఇసుక ,6 మట్టి ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. జూలూరుపాడు మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి ఇసుక తోలకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అన్నారు.
Post Views: 88