నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
2018 ఎన్నికల్లో సూర్యాపేట నుండి పోటీ చేయకుండా తప్పుకుంటే 2019లో నల్లగొండ ఎంపీ టికెట్ ఇస్తామని పటేల్ రమేష్ రెడ్డికి ఆశ చూపి మోసం చేసిన కాంగ్రెస్ మళ్లీ ఇప్పుడు కూడా అదే పనిచేసింది.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2018 లో జరిగినట్లే అధిష్టానం రాంరెడ్డి దామోదర్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడం.. రమేష్ రెడ్డిని పోటీ చేయకుండా విరమించి నల్లగొండ ఎంపీ టికెట్ ఇస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సహా అగ్ర కాంగ్రెస్ నాయకులు రాతపూర్వక హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన మొదటి జాబితాలో ఈసారి కూడా ఆయనకు టికెట్ ఇవ్వకుండా జానారెడ్డి కొడుకు కుందూరు రఘువీర్ రెడ్డికి టికెట్ ఖరారు చేసింది.
ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.
Post Views: 95