నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మణుగూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను, మణుగూరుకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త కర్నె రవి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్త్రీ ఒక తల్లిగా అక్కగా చెల్లిగా భార్యగా ఉద్యోగినిగా సమాజంలో బాధ్యతగల పౌరురాలిగా తన విధులను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లోనూ సమానంగా రాణిస్తున్నారని, ప్రపంచ గతినే మారుస్తున్నారని కొనియాడారు. అటువంటి స్త్రీలను గౌరవించడం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం మహిళా కార్మికులను రాములు , సురేందర్ రెడ్డి, బాలాజీ స్వీట్ షాప్ రంగన్న సహకారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్, మణుగూరు న్యాయవాదులు గొడుగునురీ.నాగర్జన రెడ్డి,రాము, మున్సిపల్ సిబ్బంది రత్నాకర్,కొటి, రాంబాబు,బోటక.శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు.
