+91 95819 05907

KTDM: ముఖ్యమంత్రి పర్యటన ఖరారు. ఆ శాఖల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫెరెన్స్

*జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పలు శాఖ ల అధికారులతో టెలికాన్ఫరెస్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఈ నెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు ఐనట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథక ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్, ఎస్పీ రోహిత్ జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలం పర్యటించనున్నారని తెలిపారు.
ఉదయం ముందుగా
సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని, మిథిలా స్టేడియంలో ఏర్పాటుచేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారని, తదుపరి, అక్కడే ఏర్పాటు చేసిన సభలో మూడు వేలమంది ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభిస్తారని, తదుపరి భోజన అనంతరం, మణుగూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారనితెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో మాట్లాడుతూ హెలిపాడ్ ఏర్పాట్లు, భద్రత ఏర్పాట్లు, క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. హేలిపాడ్ వద్ద అంబులెన్స్, డాక్టర్లు, ఫైర్ ఇంజన్, మొదలగు అత్యవసర ఏర్పాట్లుచేయాలన్నారు.

ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ తో మాట్లాడుతూ కళ్యాణ మండపం వద్ద ఎలక్ట్రికల్,జనరేటర్, ఏసీల ఏర్పాటు వాహనాల పార్కింగ్ కొరకు వసతి ఏర్పాట్లు పర్యవేక్షించలన్నారు.
ముఖ్యమంత్రి దైవదర్శనం, సమీక్షా సమావేశం, ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు సిట్టింగ్ అరేంజ్మెంట్, మంచి నీటి వసతి, పరిశుద్ధ శాఖాహార భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆర్డీవో భద్రాచలం ను ఆదేశించినైనది.

సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై జరిగిన, జరగవలసిన పనులు పూర్తి నివేదిక సిద్ధం చేసుకోవాలని ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.
బార్కేడింగ్ ఏర్పాట్లు, హెలిపాడ్ ఏర్పాట్లు, కుర్చీలు ఏర్పాట్లు, మణుగూరులో జరిగే బహిరంగ సభ, ఏర్పాట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు ను ఆదేశించారు.

భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకోవాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవిని ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం డిఆర్ఓ రవీంద్రనాథ్ ను అన్ని ఏర్పాట్లపై పర్యవేక్షించవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదేశించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ రవీంద్రనాథ్, డి ఆర్ డి ఓ విద్యాచందన, జిల్లా పరిపాలన అధికారి గన్య, డి ఎం హెచ్ ఓ శిరీష, డీఎస్ఓ రుక్మిణి, భద్రాచలం ఆర్టీవో కే దామోదర్ రావు, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు , ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, ఇరిగేషన్ ఈఈ అర్జున్ , మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !