*లగ్జరీ కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు
*కరెంట్ బిల్లు *Zero*
*ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుందా?
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: వారు నివాసం ఉండేది భూతల స్వర్గం లాంటి అ అపార్ట్మెంట్స్ లో… కనీసం అక్కడ ఒక ప్లాట్ బుక్ చేసుకోవాలంటే సుమారు రూ.70 లక్షల పై మాటే. అంత కాస్ట్లీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకంలో భాగంగా జీరో బిల్లు రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గృహ జ్యోతి పథకం అమలు చేస్తామని ప్రకటించిన విషయం విధితమే. ఈ డేటా బేస్ ని ఆధారంగా చేసుకుని విద్యుత్ శాఖ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో అనర్హులు దొడ్డిదారిలో ప్రభుత్వ పథకాలు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ఇట్టే అర్థం అవుతుంది. వివరాలు…
లగ్జరీ అపార్ట్మెంట్ వాసులకు సైతం గృహజ్యోతి జీరో కరెంట్ బిల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా 200 యూనిట్లు కరెంట్ వాడే వారికి ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. పుప్పాలగూడ లోని గ్రీన్ స్పేస్ హౌసింగ్ సొసైటీలోని లగ్జరీ అపార్ట్మెంట్ వాసులకు సైతం జీరో కరెంట్ బిల్లులు జారీ అయ్యాయి. రూ కోట్లు లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అపార్ట్మెంట్లకు జీరో బిల్లు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశానియమైన అంశంగా మారింది. ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందో వెయిట్ చేయాల్సిందే.
