★1976 లో ఓటు బ్యాంకు కోసం ఆదివాసీలను నిట్ట నిలువుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీ
★భద్రాచలం కేంద్రం గా LAW కళాశాల ఏర్పాటు చెయ్యాలి
★CM రేవంత్ రెడ్డి ది ఆదివాసీ ల పై సవతి తల్లి ప్రేమ
★ఆదివాసీలకు మహబూబాబాద్ MP టికెట్ కాంగ్రెస్ ఎందుకు కేటాయించి లేదు?
★ GSP రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర.
నేటి గదర్ న్యూస్ ,వెంకటాపురం: లంబాడి సామాజిక వర్గానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఏజెన్సీ ప్రాంతం నుండి బహిష్కరించండి అని GSP రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర పిలుపునిచ్చారు.
శనివారం వెంకటాపురం మండల కేంద్రంలోని విశ్రాంతి భవన ఆవరణలో GSP అత్యవసర6 సమావేశం GSP ములుగు జిల్లా నాయకులు మడకం రవి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ. … 1976 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఆదివాసీల్ని నిట్ట నిలువుగా ముంచారని ఆయన ఆరోపించారు. ఆదివాసీల కుల సంప్రదాయాలను ఏ రాజకీయ పార్టీలు కూడా గుర్తించటం లేదని ఆయన ఆరోపించారు. ఈ నెల 11 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్న CM రేవంత్ రెడ్డి భద్రాచలం కేంద్రంగా ఆదివాసి LAW కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆదివాసీల బ్రతుకులను మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని ఆదివాసీలకే మహబూబాబాద్ MP టిక్కెటు ఆదివాసుల ఇవ్వకుండా లంబాడి లకు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రమైన చతీష్ గడ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలలో లంబాడీలు ఓసి, బీసీలుగా చలామణి అవుతున్నప్పటికీ, తెలంగాణలో 5వ షెడ్యూల్ ఏరియాలో మహబూబాబాద్ ఎంపీ టికెట్ కు స్వతంత్ర అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏజెన్సీ ప్రాంతంలోకి రాకుండా అడ్డుపడతామని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో బంజారా కుల దృవీకరణ పత్రాలను రద్దు చేయాలని హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అడవి పై నీటిపై భూమిపై సర్వహక్కులు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని అన్నారు.ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఆదివాసీలపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆయన అన్నారు.ఆదివాసీలు భారతదేశానికి మూలవాసులని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అంటున్నప్పటికీ ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ లపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో పూనెం ప్రతాప్,సూర్యం ,వెంకట్,తదితరులు పాల్గొన్నారు.