నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు లో ఈ నెల 11 సోమవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా దీవెన బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే లు పాయం ,జారే ఆదినారాయణ, మంత్రి పొంగిలేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తాంబూరి దయాకర్ రెడ్డి సభా ప్రాంగణ ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. హెలీపాడ్లను సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏజెన్సీ లో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ బహిరంగ సభకు వచ్చే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు,ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, DCCB మాజీ చైర్మన్ , కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మువ్వా విజయ బాబు, DCCB డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ,జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.









