నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల పై విధిస్తున్న VAT ను ఎత్తి వెయ్యాలని మద్యం షాపుల లైసెన్స్ దారులు వైరా IML డిపో ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైన్స్ &బార్ అసోసియేషన్ కన్వీనర్ గుర్రాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… మద్యం వ్యాపారులు ఇప్పటికే GST, ఇతర TAX లు కడుతున్నారని ఐనా VAT పేరు తో 7% పెంచడం మూలంగా మద్యం వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత విధానాన్ని అమలు చేయాలని, VAT రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకు మద్యం కొనుగోలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు వైన్ షాప్ నిర్వాహకులు పాల్గొన్నారు.
Post Views: 98