★ CPIML మాస్ లైన్ ప్రజాపందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చేలా రంగారెడ్డి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఫాసిస్టు మతోన్మాదులను ఓడించి విప్లవశక్తులను ఐక్యం చేయడమే రాయలసుభాష్ చంద్రబోస్ కి అర్పించే నిజమైన నివాళి అని CPIML మాస్ లైన్ ప్రజాపందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చేలా రంగారెడ్డి అన్నారు.
భద్రాచలం పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంద పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 8 వ వర్ధంతి జరపడం జరిగింది. తొలుత సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి అపార్టీ నాయకులు నివాళులర్పించారు .అనంతరం ఏర్పాటు చేసిన రాయల సుభాష్ చంద్రబోస్ 8 వ వర్ధంతి సభకు హాజరైన కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ… ప్రజా పంథామార్గంలో ప్రజా ఉద్యమాలను నడిపించి దోపిడీ పాలకవర్గాలకు, మతోన్మాద ఫాసిస్టు, కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గాల కు వ్యతిరేకంగ పోరాడమే సుభాష్ చంద్రబోస్ కి ఇచ్చే ఘనమైన నివాళిని అన్నారు. రాయల సుభాష్ చంద్రబోస్ సుమారు 50 సంవత్సరాలు పాటు జీవితాంతం ప్రజలను చైతన్యవంతం చేస్తూ, దేశంలో పెరిగిపోతున్న దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా విప్లవ పార్టీలన్నీ కలిసి పోరాడాలని కోరుకున్నారని ఆయన అన్నారు. సుభాష్ చంద్రబోస్ తెలంగాణ రైతంగా పోరాటంవిప్లవ పాఠాలతో, జాతీయోద్యమ పోరాటాల స్ఫూర్తి తోటి, భారతదేశంలో జరిగిన అనేక కార్మిక రైతు పోరాటాలు స్ఫూర్తితో జాతీయస్థాయిలో ఎది గాడని ఆయనన్నారు.ప్రజా పోరాటాలలో అనేకమంది అమరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వారి త్యాగాలను వృధా పోనీయకుండా ముందుకు తీసుకుపోవాలని రాయల సుభాష్ చంద్రబోస్ ఆకాంక్షించారని ఆయన అన్నారు. నేడు దేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ పాసిస్తూ మతోన్మాదం తీవ్రంగా పెరిగిపోయి ప్రజల మీద అమానుష దాడులను కొనసాగిస్తున్నదని, నేడు అదే ప్రమాదకర స్థితిలో ఉన్నదని ప్రజలందరూ కూడా వామపక్ష శక్తులందరూ కూడా ఐక్యంగా ఎదుర్కొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను కూడా నేడు హరిస్తున్నారని అన్నారు రాయల సుభాష్ చంద్రబోస్ నమ్మిన ఆశయాలు సిద్ధాంతాలు సఫలీకృతం కావాలంటే విప్లవశక్తులందరూ కూడా ఐక్యం కావాలని అందుకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కృషి చేస్తుందని,రవి కూడా అదే కోరుకున్నారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ కూడా ఆయన నడిచిన మార్గంలో ముందుకు నడవాలని ఆయన కోరారు. ప్రజల మీద దాడులు చేస్తున్న భూసాన్య పెత్తందారి వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి, ప్రశ్నించుటం నేర్పారని, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారాణి వారన్నారు అని పిలిపునిచ్చారు రాజ్యాంగబద్ధ హక్కులను కూడా హరిస్తున్న పరిస్థితిలో అన్ని దేశభక్తి శక్తులు ప్రజాస్వామ్యవాదులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కెచ్చల కల్పన పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ డివిజన్ నాయకులు భీమ్ రాజు, మునిగల శివ, కొండ కౌశిక్, కుమారి, నాగరత్నం శాంత రమ సిరితోష్ షకీరా, స్వాతి,మహేశ్వరి, ప్రసన్న, నసీమా,బ్లేస్సి పాల్గొన్నారు.
