*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షత నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ నెల 11న సోమవారం మణుగూరు మండల కేంద్రంలో నిర్వహించ తల పెట్టిన ప్రజా దీవెన బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ,పలువురు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని….కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజాదీవెన బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు,అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాదీవెన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.