ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
జూలూరుపాడు, మార్చి 10, (నేటి గధర్ న్యూస్ ): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారి పై జూలూరుపాడు పోలీస్ సిబ్బంది శనివారం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీలో ప్రభుత్వ నిషేధిత గంజాయి పట్టుబడిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు గంజాయితో కొత్తగూడెం నుండి ఖమ్మం వైపు వస్తున్నారన్న సమాచారంతో స్టేషన్ ఇంచార్జ్ ఎస్ఐ ఎం రవి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. వారి వివరాలను తెలుసుకొనగా హైదరాబాద్ గోషామహల్ కి చెందిన దత్తాత్రేయ ఉపాధ్యాయ, రామారావు బిలాదర్ గా గుర్తించారు. వారి వద్ద నుండి 61కేజీ లా గంజాయినీ సుమారు 12 లక్షల 20వేల రూపాయల విలువగల గంజాయిని, మూడు సెల్ ఫోన్ లను, మారుతి బెలోనో కారును స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపేరు.