★11 నెలలు గా వేతనాలు రాలే
★GO No.63,PRC 2020 ప్రకారం రూ.31,040 అమలు చెయ్యాలి
★ప్రతి నెల 5వ తారీఖు లోపు వెతనం జమ చెయ్యాలి
★ESI ,PF అమలు చెయ్యాలి
★మహిళ ధరణి ఆపరేటర్ల కు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి
★చెప్పులరిగేలా తిరిగిన కరుణించని పాలకులు
★సీఎం రేవంత్ పై గంపెడు ఆశలు
నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూలో సంస్కరణలు తీసుకురావాలనే సదుద్దేశంతో ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయాలలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవడానికి 2018 MAY 23 న e centric solution అనే థర్డ్ పార్టీ ప్రైవేట్ సంస్థ టెండర్ దక్కించుకుంది.వారు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోఆర్డినేటర్లను, 713 ధరణి కంప్యూటర్ ఆపరేటర్లను రూ.9876/-నెల వేతనం తో ఔట్సోర్సింగ్ లో నియమించుకున్నారు. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిందో… కొన్ని లోపాలు మినహా ఆ మేరకు ఫలితాలు రావడం జరిగింది. ప్రభుత్వ ఖజానాకి రెవెన్యూ రాబడి పెరిగింది. రెవిన్యూ లో పనులు సైతం పారదర్శకంగా జరిగాయి .ఇంతవరకు బాగానే ఉన్నా… ధరణి కంప్యూటర్స్ ఆపరేటర్స్ బాధలు తీర్చేవారు లేరు. ఒక నెల కాదు రెండు నెలలు కాదు… సుమారు 11 నెలలుగా వేతనాలు రాక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వారు కలవని మంత్రి లేరు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవలే హైదరాబాద్ ప్రజా దర్బార్ లో సైతం వినతి పత్రం అందజేశారు. అయినా ప్రభుత్వం నుండి నేటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. తక్షణమే తమ వేతనాలు విడుదల చేయాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు వేడుకుంటున్నారు.
*ధరణి ఆపరేటర్ల డిమాండ్లు ఇవే*
★ ధరణి ఆపరేటర్లను పర్మినెంట్ చేయాలి
★GO No.63,PRC 2020 ప్రకారం రూ.31,040 అమలు చెయ్యాలి
★ప్రతి నెల 5వ తారీఖు లోపు వెతనం జమ చెయ్యాలి
★ESI ,PF అమలు చెయ్యాలి
★మహిళ ధరణి ఆపరేటర్ల కు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి